బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (10:08 IST)

మళ్లీ 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇటీవల 16 వేలుగా నమోదవుతూ వచ్చిన ఈ కేసులు ఒక్కసారిగా 20 వేలకు పైగా చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 22,431 క‌రోనా కేసులు నమోదుకాగా, క‌రోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,38,94,312కి పెరిగింది. 
 
దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,00,258కి చేరింది. నిన్న 318 మంది క‌రోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య  4,49,856కు చేరింది. ప్ర‌స్తుతం 2,44,198 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఒక్క కేరళ రాష్ట్రంలోని 12616 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
నిన్న దేశంలో 43,09,525 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92,63,68,608కి పెరిగింది. కేర‌ళ‌లో నిన్న 12,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 134 మంది క‌రోతో ప్రాణాలు కోల్పోయారు.