గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (11:32 IST)

ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్త‌గా 22,842 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 244 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. 
 
గడిచిన 24 గంటల్లో 22,842 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 25,930 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,30,94,529కి చేరింది. క‌రోనాతో 244 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,48,817కి పెరిగింది. 
 
ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,70,557 మంది చికిత్స తీసుకుంటున్నారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులోనే 13,217 మందికి క‌రోనా సోకింది. ఆ రాష్ట్రంలో క‌రోనాతో నిన్న‌ 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 90,51,75,348 క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.