1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:52 IST)

దేశంలో మరో 28 వేల కరోనా పాజటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 28326 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, క‌రోనా నుంచి శనివారం 26,032 మంది కోలుకున్నారు. నిన్న క‌రోనాతో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌లో 3,03,476 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,29,02,351 మంది కోలుకున్నారు. 4,46,918 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేర‌ళ‌లో 16,671 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న‌ మృతుల సంఖ్య 120 గా న‌మోదైంది. 
 
దేశ వ్యాప్తంగా శనివారం 68,42,786 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 85,60,81,527 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.
 
అలాగే, శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిచిన వివరాల మేరకు.. ఆ రాష్ట్రంలో 52,702 కరోనా పరీక్షలు నిర్వహించగా, 248 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 
 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 21, నల్గొండ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
 
అదేసమయంలో 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,64,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,56,285 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,701 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,912కి పెరిగింది.