సంబంధిత వార్తలు
- ఇక టీడీపీ బతుకు శ్రీలంకే - పచ్చ మీడియాకు చెంపదెబ్బ : విజయసాయి రెడ్డి ట్వీట్
- వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - రాత్రికి రాజమండ్రిలోనే బస
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎంసెట్ పరీక్షా ఫలితాల వెల్లడి
- 26న వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్
- నిధులు ఉంటే కదా రోడ్లకు రిపేర్లు చేసేది: మంత్రి గుమ్మనూరు జయరాం
ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.
ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సు పరీక్ష 87,744 మంది రాశారు.
ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈ ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ప్రవేశాలకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేదు.
ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రవేశాలు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా 35 శాతం సీట్లు ఈసారి ప్రభుత్వమే భర్తీ చేస్తుంది.
