సంబంధిత వార్తలు
- ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్.. వచ్చేనెలలో కరోనాకు వ్యాక్సిన్ రెడీ!
- #oxfordvaccine కరోనాకు ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ మందు.. యాంటీబాడీస్ పెరిగాయ్
- ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో తప్పకుండా జరుగుతుందా? 100%?
- నేను సేఫ్.. ఆందోళన వద్దు - ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా
- ఒకటి రెండు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్ అసాధ్యం : సీసీఎంబీ
ఆశలు రేపుతున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ - సైడ్ ఎఫెక్ట్స్ నిల్...
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుకనిపెట్టేందుకు అనేక ప్రపంచ దేశాల్లో వివిధ రకాల పరిశోధనల్లో నిమగ్నమైవున్నాయి. ముఖ్యంగా, కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు దేశాలు ప్రయోగాలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాల్లో అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, భారత్‌లోని బయోటెక్ ఫార్మా కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి.
ఈ క్రమంలో ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ అన్నింటికంటే ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ దశలో ఉంది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా, వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించడంలేదని, పైగా రెట్టింపు రక్షణ కలుగుతోందని ఆస్ట్రాజెనెకా వర్గాలు తెలిపాయి.
యాంటీబాడీలతో పాటు ఇమ్యూనిటీకి దన్నుగా నిలిచే టి-కణాలు కూడా మెండుగా ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హోర్టన్ మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరిలోనూ రియాక్షన్ కనిపించలేదని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌తో వ్యక్తుల్లోని ఇమ్యూనిటీ చైతన్యం పుంజుకుందని వివరించారు.
తర్వాతి కథనం
