ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్.. వచ్చేనెలలో కరోనాకు వ్యాక్సిన్ రెడీ!

Corona vaccine
కరోనా వ్యాక్సిన్
సెల్వి| Last Updated: సోమవారం, 20 జులై 2020 (22:34 IST)
కరోనాతో విలవిలలాడుతున్న ప్రపంచానికి రష్యా శుభవార్త తెలిపింది. కరోనా అంతుచూసే టీకా సిద్ధమైనట్లు వెల్లడించింది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని.. వచ్చేనెలలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి జులై 20న ప్రకటించారు. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు విజయవంతం అయ్యాయని తెలిపింది.

ఇప్పటికే రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్.. ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తొలి కరోనా వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. అదేవిధంగా ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా నిలువనుంది.

రష్యా, సౌదీ ఆరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఆగస్టు 3 నుంచి నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటికే వేలాది మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మూడు కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నారు. మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని.. వ్యాక్సిన్‌ తయారీకి 5 దేశాలు అంగీకారం తెలిపినట్టు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు.దీనిపై మరింత చదవండి :