బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (11:26 IST)

పెంపుడు కొడుకుతో గర్భందాల్చిన తల్లి.. భర్తకు విడాకులిచ్చి పెళ్లి .. ఎక్కడ?

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయా? లేక ప్రేమ గుడ్డిదా? అన్నది ఈ కాలంలో తెలియడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ గుడ్డిదనడానికి ఇది ఓ మచ్చు తార్కాణంగా చెప్పుకోవచ్చు. పదేళ్ళపాటు పెంచిన కొడుకు ద్వారా ఓ పెంపుడు తల్లి గర్భందాల్చింది. ఈ విషయం బయటకు పొక్కడంతో కట్టుకున్న భర్తకు విడాకులిచ్చి... కొడుకును పెళ్లాడింది. ఈ ఘటన రష్యాలో జరిగింది. ఈ పాడుపనికి పాల్పడింది కూడా ఓ సెలెబ్రిటీ కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రష్యాకు చెందిన మెరీనా బల్మషేవ అనే మహిళ ఓ సెలెబ్రిటీ. సోషల్ మీడియాలో తన వీడియోలు, ఫోటోలతో సెలబ్రిటీగా ఎదిగి 4 లక్షల మంది ఫాలోవర్లతో ఉంది. ఈ 35 యేళ్ళ మహిళ... అలెక్స్ ఆరే అనే వ్యక్తిని పదేళ్ల క్రితం పెళ్లాడింది. 
 
ఆ తర్వాత ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకుని, వారిని పెంచారు. తాజాగా, వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా, పిల్లల బాధ్యతను కోర్టు అలెక్స్‌కు అప్పగించింది. ఆ తర్వాత తాను దాదాపు పదేళ్ల పాటు పెంచిన వ్లాదిమిర్ వోయా (20)తో మెరీనా ప్రేమలో పడింది. అతనిద్వారా గర్భంకూడా దాల్చింది. 
 
ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే వివాహం జరగాల్సి వున్నా, కరోనా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు నిబంధనలు సడలించడంతో రిజిస్ట్రీ కార్యాలయంలో ఇద్దరూ ఒకటయ్యారు. అసలే విడ్డూరమైన తమ వివాహాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇవి వైరల్ అవుతున్నాయి. 
 
పెంచిన బిడ్డను పెళ్లాడటంపై స్పందించిన మెరీనా, పెంచుకున్న కొడుకుతో పెళ్లేంటని కొందరు ఆడిపోసుకున్నా, అది తన ఇష్టమేనని గట్టిగానే చెబుతోంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉన్న తనను తన కొత్త కంటికి రెప్పలా చూసుకుంటున్నాడనీ ఈ సోషల్ మీడియా సెలెబ్రిటీ సెలివిస్తోంది.