సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (20:35 IST)

భర్త అని ప్రియుడితో క్వారంటైన్‌లో మహిళా కానిస్టేబుల్.. చివరికి..?

మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి క్వారంటైన్ కేంద్రంలో వున్న వైద్యులంతా షాక్ తిన్నారు. ప్రియుడిని భర్త అని పరిచయం చేసి కలిసే క్వారంటైన్‌లో వున్న విషయం లేటుగా తెలిసింది. అదీ ప్రియుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తనతోటి పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో అవివాహిత మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆమె ప్రైమరీ కాంటాక్ట్ అడగగా ప్రేమికుడిని భర్తగా పేర్కొంటూ అధికారులకు వివరాలు తెలిపింది. దీంతో అధికారులు వీరిరువురిని కలిపి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. అంతా బాగానే సాగింది. కానీ అక్కడే ట్విస్ట్ దాగివుంది. 
 
భర్త మూడు రోజులైనా ఇంటికి రాకపోయే సరికి వివాహితుడైన సదరు వ్యక్తి భార్య విచారణ చేపట్టింది. ఆమెకు తన భర్త వేరే మహిళతో కలిసి క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసి షాకైంది. ఇంకా భర్తను కలవలేని పరిస్థితి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సిటీ పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన డీసీపీ సదరు వ్యక్తిని మరొక క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.