సంబంధిత వార్తలు
- హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తినాలి.. క్రికెటర్లకు బీసీసీఐ సూచన
- పాకిస్థాన్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ కూడా వెళ్తుంది..
- సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు
- అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021'లో వాటర్‌బేస్ లిమిటెడ్‌కి అవార్డు
- కోల్‌కతా ట్వంటీ20 మ్యాచ్ : కివీస్ చిత్తు - భారత్ క్లీన్‌స్వీప్
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో మరో 9 వేల కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ వైద్య బులిటెన్ మేరకు గత 24 గంటల్లో 9,283 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఈ కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,45,35,763కు పెరిగాయి. ఇందులో 3,39,57,698 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అలాగే, దేశ వ్యాప్తంగా 1,11,481 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా మరో 4,66,584 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఒక్క 24 గంటల్లోనే 437 మంది చనిపోయారు. అలాగే, 10949 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.
