1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Human Body Facts and Functions

మన శరీరంలో అవయవాలు ఏయే వేళల్లో ఏమేమి చేస్తాయో తెలుసా...!

ఫలానా సమయానికి ఫలానా పని చేయాలి. ఫలానా వ్యక్తిని కలవాలి. ఆ టైంకి భోజనం చేయాలి. ఇంకో టైంకి ఇంకో పని చేయాలి. ఆ సమయానికి నిద్రపోవాలి. ఇలా మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. కొంతమంది టైం లేకుండా చేస్తారనుకోండి. అది వేరే విషయం. అయితే మనం

Human Body Facts and Functions
ఫలానా సమయానికి ఫలానా పని చేయాలి. ఫలానా వ్యక్తిని కలవాలి. ఆ టైంకి భోజనం చేయాలి. ఇంకో టైంకి ఇంకో పని చేయాలి. ఆ సమయానికి నిద్రపోవాలి. ఇలా మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. కొంతమంది టైం లేకుండా చేస్తారనుకోండి. అది వేరే విషయం. అయితే మనం ఏ పనిచేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్ధిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును. మీరు విన్నది నిజమే. 
 
మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివ్‌గా పనిచేస్తాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్‌గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలుగుతుంది. ఈ క్రమంలో అసలు ఏయే భాగాలు ఏయే సమయాల్లో యాక్టివ్‌గా పనిచేస్తాయో అవి పనిచేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య
ప్రొటీన్లు, తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాన్ని పండ్లను ఈ సమయంలో బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉదయమే అందుతాయట.
 
ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య
ఈ సమయంలో మన శరీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరీరంలో జరిగే జీవక్రియలను గాడిలో పెడుతుందట. ఉదయం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుందట.
 
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య
ఈ సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తుందట. శరీర భాగాలకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చూస్తుందట. దీనివల్ల శరీర కణాలకు శక్తి అందుతుందట.
 
మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు
ఈ సమయంలో చిన్న పేగులు అలర్ట్‌గా ఉండి బాగా పనిచేస్తాయట. మనం తిన్న బ్రేక్ ఫాస్ట్, లంచ్‌ల జీర్ణక్రియను ముగిస్తుంటాయి.
 
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ఈ సమయంలో మన మూత్రాశయం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో ఉంటుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి
 
సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు
ఈ సమయంలోనూ మన కిడ్నీలు బాగా చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలను మూత్రాశయానికి పంపడం వంటి కార్యక్రమాలను చేస్తాయి.
 
రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య
ఈ సమయంలో పెరికార్టియం ఉత్తేజంగా ఉంటుందట. ఈ టైంలో రాత్రి భోజనాన్ని ఖచ్చితంగా ముగించాలట. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుందట.
 
రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య
ఈ సమయంలో భోజనం అస్సలు చేయకూడదట. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు ఇప్పుడు బాగా పనిచేస్తాయట. ఇవి శరీర మెటాబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్థీకరిస్తాయి. కణాలకు శక్తి అందేలా చూస్తాయి.
 
రాత్రి 11 నుంచి 1 గంట మధ్య
ఈ సమయంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఈ సమయంలో సాధారణంగా నొప్పి వస్తుందట. 
 
రాత్రి 1 నుంచి ఉదయం 3 గంటల మధ్య
ఈ సమయంలో కాలేయం చురుగ్గా ఉంటుందట. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుందట. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయదు. వ్యర్థాలు బయటకు వెళ్ళవట. 
 
ఉదయం 3 నుంచి 5మధ్య
ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయట. ఆ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలు బయటకు పంపుతున్నాయని అర్థం చేసుకోవాలట.
About Writer
TJ
తర్వాతి కథనం
ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు