'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తర్వాత నాగచైతన్య, సునీల్‌తో 'తడాఖా'తో మరో సూపర్‌హిట్ సాధించిన దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని(డాలీ). లేటెస్ట్గా డాలీ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలుగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కిశోర్ కుమార్ పార్థసాని(డాలీ)తో ఇంటర్వ్యూ విశేషాలు.
'గోపాల గోపాల' చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి సినిమా బాగుందని చెప్పడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వచ్చిన కాల్స్‌లో బెస్ట్ కాల్ సీతారామశాస్త్రిగారి నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలో 53 మంది సినిమా చూడటానికి వెళ్లారట. సినిమా చూసి వచ్చిన తర్వాత శాస్త్రిగారు ఎలా వుందని అడిగారట. చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ళ వయసు వారి వరకు సినిమా చాలా బాగుందని చెప్పారట.
తెలుగు వెర్షన్లో ఎలాంటి మార్పులు చేశారు?
హిందీ సినిమా నాకు బాగా నచ్చింది. కానీ, క్లైమాక్స్ నాకు అంతగా నచ్చలేదు. హీరోకి పెరాలసిస్ వచ్చిందంటే అది ఎవరి వల్ల వచ్చింది. దేవుడు వచ్చి హీరోకి భగవద్గీత ఇచ్చి అతనికి ఓ దారి చూపించినవాడు అతనికి పెరాలసిస్ వచ్చేలా ఎందుకు చేస్తాడు. దాన్ని ఛేంజ్ చెయ్యాలనుకున్నాను. భక్తులు బాబాలను, స్వామీజీలను గుడ్డిగా నమ్ముతారు.
అందులో మంచివారు వున్నారు, చెడ్డవారు వున్నారు. చెడ్డవారి గురించి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. కొంతమంది స్వామీజీలను జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసిన సందర్భాలు మనం విన్నాం. వాళ్ళు నమ్మిన స్వామీజీ ఏది చేసినా కరెక్టే అని వారి ఉద్దేశం. తాను నమ్మిన స్వామీజీని బోనెక్కించడం ఒకడికి కోపం తెప్పించింది. దాంతో క్లైమాక్స్‌లో హీరోని పొడిచినట్టు మార్పు చేశాం.
ప్రజల నమ్మకాన్ని దోచుకోవడంలో అటు వెంకటేష్, ఇటు స్వామీజీలు కూడా దొంగలేకదా? దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు?
మంచి ప్రశ్నే... ఒక దొంగ. ఒక రాబిన్ హుడ్.. ఇద్దరూ దొంగలే. కానీ ఒకతను దోచుకుని ప్రజలకు అంటే లేనివారికి పంచిపెట్టి వారి కడుపు నింపుతాడు. అలాంటి పాత్రే వెంకటేష్‌ది. ఇక స్వామీజీలు.. తమ పొట్ట కోసమే ఇతరుల్ని ఇబ్బందిపెట్టి.. స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు.
పవన్ కళ్యాణ్‌ని దేవుడు క్యారెక్టర్ నిర్ణయం ఎవరిది?
అది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. దేవుడంటే ఎలా వుంటాడు అనేది ఎన్.టి.రామారావుగారిని చూసి ఫిక్స్ అయి వున్నాం. దేవుడి పాత్ర చెయ్యాలంటే అతనికి చాలా మంచి ఇమేజ్ వుండాలి. అలాంటి ఇమేజ్ పవన్ కళ్యాణ్‌లో వుందని మేం ఫీల్ అయ్యాం.
సబ్జెక్ట్ విషయంలో హీరోల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు వుంది?
అలాంటిది లేదండీ. ఈ కథ తీసుకున్న తర్వాత ఆరు నెలల పాటు నేను, భూపతి రాజా, దీపక్ రాజ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి కొన్ని మార్పులు చేశాం.
దేవుడికి రూపం లేదని చెప్పారు.. కానీ ఇందులో కృష్ణుడి రూపాన్నే ఎందుకు తీసుకున్నారు..?
అయితే దేవుడు ప్రతి మనిషిలో ఉంటాడని చెప్పాలనుకున్నాం. అందుకు కృష్ణుడు గెటప్ తీసుకున్నప్పటికీ.. చివరికి ఆయనతోనే ఓ ముస్లింలో, ఓ క్రిస్టియన్లో, ఓ హిందులో, ఓ చిన్నపిల్లాడిలో ఉంటానని చెప్పించాం.
ఈ సినిమా చేసే అవకాశం మీకెలా వచ్చింది?
వెంకటేష్‌గారికి ఈ సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో వుంది. ఈ సినిమా రిలీజ్ అయినపుడు నేను షూటింగ్లో బిజీగా వున్నాను. డైరెక్ట్‌గా థియేటర్లో ఈ సినిమా చూడలేదు. ఒకసారి టి.వి.లో వస్తుంటే చూసి షాక్ అయ్యాను. వెంటనే డి.వి.డి. తెప్పించుకొని మళ్ళీమళ్ళీ చూశాను. ఇది వండర్ఫుల్ స్క్రిప్ట్ అనిపించింది. యాక్చువల్‌గా నాతో వేరే సినిమా చేద్దామనుకున్నారు వెంకటేష్‌గారు. కానీ, ఈ స్క్రిప్ట్ బాగుంది అనుకున్న తర్వాత ఇదే చెయ్యాలని డిసైడ్ అయ్యాము.
సురేష్ బాబుగారితో సినిమా అంటే కష్టమనే టాక్ వుంది?
అవును. అదెలా వచ్చిందో తెలీదు. కొంతమంది భయపెట్టారు కూడా. కానీ ఆయన అంత కంఫర్ట్బుల్ పర్సన్ ఇంకోరు లేరు. కథ డిస్కషన్లో చాలా మార్పులు గురించి చర్చించుకుంటాం. అది ఇలా కాదు. ఇది ఇలా వుండాలి. అనేది మొహమాటం లేకుండా చెప్పేస్తాను. అలా చెప్పేవారు కావాలి. తను చెప్పినట్లే వింటే ఇక దర్శకుడిగా మనమెందుకు. నాకు తెలిసి.. సురేష్ బాబు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో ఇంకా మార్పుచేద్దామంటే.. చేసేకొద్దీ ఇంకా వస్తుందనేవారు.
డైలాగ్స్ పవన్ రాజకీయాల నేపథ్యం గురించి రాయించారా?
అలాంటిది ఏమీలేదు. ఎక్కడైనా.. సమర్థులు ఇంట్లో కూర్చొంటే అసమర్థులు రాజ్యమేలుతారనేది పాత సామెతే. ఇలాంటివి కథ ప్రకారం పెట్టాం. ఈ సినిమాకి సాయిమాధవ్ అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మరో విషయం ఏమిటంటే రైటర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా వారి నుంచి నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. ఏ పాయింట్లో సాయిమాధవ్ ఇబ్బంది పడకుండా ఎన్ని వెర్షన్స్ రాయమంటే అన్ని వెర్షన్స్ ఎలా కావాలంటే అలా రాశారు. అందులో బాగా సూట్ అయ్యేవి సెలెక్ట్ చేసి తీసుకున్నాం. ఇప్పుడు డైలాగ్స్‌కి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
అనూప్ మ్యూజిక్ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయింది?
అనూప్ కూడా ఒక రకంగా సాయి మాధవ్ లాగే చాలా ట్యూన్స్ చేసి ఇచ్చారు. అల్టిమేట్‌గా ట్యూన్ వుంది అనేవరకు చేశారు. నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చేవరకు ట్యూన్స్ చేశారు. ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సినంత టైమ్ ఇవ్వగలిగితే ఔట్పుట్ కూడా అంత బాగా వస్తుందనేది నా నమ్మకం.
మీ తదుపరి ప్రాజెక్ట్స్?
పవన్ కళ్యాణ్‌గారి కోసం సబ్జెక్ట్ రెడీ చెయ్యాల్సి వుంది. ఇప్పుడు గోపాల గోపాల ప్రమోషన్ వర్క్ జరుగుతోంది కదా. ఇది పూర్తయిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని(డాలీ).