1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Will the privatisation of APSRTC help the organization

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

apsrtc electric
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా, సంస్థలో కొత్తగా వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. దీంతో ప్రైవేటు పరం చేయనున్నారనే వార్తలకు ఇలాంటి చర్యలు మరింత ఊతమిస్తున్నాయి. 
 
దీనిపై ఏపీఎస్ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. ఎలక్ట్రిక్‌ బస్సుల వల్ల సంస్థ ప్రైవేటీకరణ కాదని, ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవా పథకం కింద రాష్ట్రానికి 1,050 బస్సులను కేంద్రం కేటాయించిందని తెలిపింది. 
 
ఇందులో 11 నగరాలకు 750 బస్సులు, తిరుమల - తిరుపతి ఘాట్‌లో నడిపే 300 బస్సులు ఉన్నాయి. వీటికి కేంద్రమే టెండర్లు పిలిచి, మన రాష్ట్రంలో పినాకిల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ బస్సులు సరఫరా చేసేలా నిర్ణయించింది. సురక్షితమైన, పర్యావరణహిత ప్రజారవాణాకు సంస్థ కట్టుబడి ఉందని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 
About Writer
ఠాగూర్