ఇంటి స్థలానికి తూర్పు-దక్షిణ వీథులుంటే అది ఆగ్నేయపు బ్లాక్ అవుతుందని వాస్తుశాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఈ స్థలము ఉత్తర, ఈశాన్యముల కంటే ఆగ్నేయము ఎత్తుగా ఉండాలి. ఈ స్థలానికి ఆగ్నేయ భాగంలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ వంటివి ఉండకూడదు. గృహం నిర్మించేటపుడు ఆగ్నేయమూలను కలపకుండా కొంచెం ఖాళీ వదలాలి. గృహము నందు ఆగ్నేయంలో కరెంట్ మీటర్లు గానీ, జనరేటర్లుగానీ ఆగ్నేయభాగములో ఉంటే శుభఫలితములు కలుగుతాయి. అయితే ఈ దిశలో ఆఫీస్ రూం లను నిర్మించటం శ్రేయస్కరం కాదు.