సంబంధిత వార్తలు
- RX100 చిత్రం కార్తికేయ హీరోగా కృష్ణ దర్శకత్వంలో కలైపులి చిత్రం `హిప్పీ`
- పెరుగుతున్న పెట్రోల్ ధరలు- ఆల్ టైమ్ రికార్డ్.. సామాన్యుడికి చుక్కలు
- చంద్రబాబుకు నోటీసులు.. టెన్షన్ పడక్కర్లేదు.. ఉండవల్లి క్లారిటీ
- పెట్రోల్ ధరలపై బీజేపీ స్పెషల్ గ్రాఫ్... పడీపడీ నవ్వుకుంటున్న నెటిజన్లు
- సింగర్ పూజా ప్రసాద్‌తో ఎస్ఎస్.రాజమౌళి కుమారుడు పెళ్లి
బాబా ప్రధాని అయితే రూ. 39కే లీటర్ పెట్రోల్
రామారావు: ఆ వెంకీ ఏంటి ఆఫీస్‌కి రావట్లేదా.. ఏదో పనిలో బిజీగా ఉన్నట్లున్నావ్? వెంకీ: అదేం లేదు రామారావు గారు పెట్రోల్ ధర కాస్త లీటరు 90 రూపాయలకు చేరువలో ఉంది, నేను రోజు సంపాదించే దానిలో సగం దానికే ఖర్చయిపోతోంది. అందుకే దీనికో పరిష్కారాన్ని కనిపెడుతున్
రామారావు: ఆ వెంకీ ఏంటి ఆఫీస్‌కి రావట్లేదా.. ఏదో పనిలో బిజీగా ఉన్నట్లున్నావ్?
వెంకీ: అదేం లేదు రామారావు గారు పెట్రోల్ ధర కాస్త లీటరు 90 రూపాయలకు చేరువలో ఉంది, నేను రోజు సంపాదించే దానిలో సగం దానికే ఖర్చయిపోతోంది. అందుకే దీనికో పరిష్కారాన్ని కనిపెడుతున్నాను.
రామారావు: ఏంటది?
వెంకీ: అదే... నేను రెక్కలు కట్టుకుని పక్షిలాగా ఎగిరి ఆఫీస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.
రామారావు: అరెరే.. ఈ ఆలోచన బాగుందే. నాకు కూడా బాగా ఉపయోగపడేలా ఉందే. మరి స్కూటర్‌ను ఉపయోగించవా?
వెంకీ: అలా అడుగు చెప్తా. పతంజలి బాబా రాందేవ్ ప్రధాని అయ్యేంత వరకు స్కూటర్‌ను ఉపయోగించను.
రామారావు: రాందేవ్ బాబాకు దీనికి సంబంధం ఏమిటి?
వెంకీ: బాబా ప్రధాని అయితే పతంజలి దుకాణాలలో దేశీయ పెట్రోలు 39 రూపాయిలకే విక్రయిస్తాడట మరి.
