సంబంధిత వార్తలు
- నిజామాబాద్: ఫుడ్ పాయిజన్.. 80మంది విద్యార్థులకు అస్వస్థత
- మైనర్ బాలికలపై కన్నేసిన డ్రైవర్.. తెల్లారితే రెస్టార్ట్కు సాయంత్రం ఇంటికి..?
- తరగతి గదిలో గొడవపడిన ముస్లిం విద్యార్థులు.. పాకిస్థాన్ వెళ్లాలంటూ టీచర్ ఆగ్రహం
- జిందాల్ గ్లోబల్ వర్శిటీ: ఆలుగడ్డలు ఉడికించి కాళ్ళతో తొక్కుతున్న క్యాంటీన్ సిబ్బంది..
- కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు.. స్కూళ్లలో ఫోన్లు నిషేధం
దసరా కానుకగా తెలంగాణలో "ముఖ్యమంత్రి అల్పాహారం"
దసరా కానుకగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించిన "ముఖ్యమంత్రి అల్పాహారం" పథకం ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 24 నుండి పౌష్టికాహార అల్పాహారం అందించబడుతుంది.
ఈ కార్యక్రమానికి సుమారు రూ. ఏటా 400 కోట్లతో, విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రారంభించబడింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ పథకం అమలులోకి రానుంది. తమిళనాట ఇప్పటికే ఈ పథకం అమలులో వుంది. ఇదే తరహాలో తెలంగాణలోనూ పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుందని టి సర్కారు భావిస్తోంది.
ఉదయాన్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
