శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (10:26 IST)

నా తండ్రి శోభన్‌బాబు.. తల్లి జయలలిత.. డీఎన్ఏ టెస్టుకు రెడీ..

Jayalakshmi
Jayalakshmi
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే అసలైన వారసురాలినని జె. జయలక్ష్మి తెలిపారు. తన తండ్రి ప్రముఖ సినీనటుడు శోభన్‌బాబు అని తెలిపారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. 
 
జయలలిత సినిమాల్లో నటించేటప్పుడు తాను ఆమెతో పాటే పోయెస్ గార్డెన్‌లో వుండేదానినని వెల్లడించారు. ఆమె రాసుకున్న డైరీ, ఉపయోగించిన దుస్తులు, వస్తువులు తన వద్ద చాలా ఉన్నాయని చెప్పారు. 
 
ఎన్నో కారణాల వల్ల తాను జయ కూతురునని అప్పట్లో చెప్పలేకపోయానని వెల్లడించారు. అమ్మ సీఎం అయిన తర్వాత కొన్ని పనులపై రెండు సార్లు కలిశానని, అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఓసారి కలిశానని తెలిపారు. 
 
ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టించింది. జయలలిత మరణం తర్వాత తానే ఆమె అసలైన కూతురునని జయలక్ష్మి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి తన గురించి తెలిపారు. 
 
అఖిల భారత ఎంజీఆర్ మున్నేట్ర కళగం పేరుతో పార్టీని ప్రారంభించానని, లోక్‌సభ ఎన్నికల్లో 39 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.