సర్కారు వారి పాట చిత్రానికి అసని దెబ్బ!
Maheshbabu
గత కొద్దిరోజులుగా తెలంగాణలోనూ గాలివానతోకూడిన అకావల వర్షాలు రావడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక పట్టణాలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు ఆంధ్రలోని నెల్లూరు, వైజాగ్, విజయవాడ తదితరప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలలో ఈ అసని తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా వుంది. మరోవైపు రిలీజ్ తేదీ వాయిదా వేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇతర సినిమాలపై ఎఫెక్ట్ వుంటుంది. తర్వాత ఎఫ్3 రాబోతుంది. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే థియేటర్ల సమస్యకూడా తలెత్తుంది. రేపే విడుదలకాబోతున్న సర్కారు వారి పాట తుఫాన్ వల్ల ఓపెనింగ్ బాగా తగ్గేసూచనలు తీవ్రంగా కనిపిస్తున్నాయి.
