ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (10:48 IST)

బికినీ బర్త్ డే.. అమీర్ ఖాన్ గారూ.. ఇలా కూడా బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటారా?

Amir khan Daughter
Amir khan Daughter
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇందుకు కారణం ఐరా ఖాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్. ఐరాఖాన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ట్రోలింగ్స్‌కి గురయ్యాయి.
 
ఐరా ఖాన్ బికినీలో బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకోవడం, బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి అల్లరి చేయడం, ఇక ఆ బికినీ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో అమీర్ ఖాన్ కూడా ఉండటంతో మరింత రచ్చ మొదలైంది. 
 
గతంలో కూడా ఇదే విధంగా ఐరా ఖాన్, అమీర్ ఖాన్ ఫోటోలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఇప్పుడు కూడా ఇలా బికినీలో ఫ్యామిలీ అంతా కనిపించడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. 
 
ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదా? అసలు మీరు ఇస్లాంకు చెందినవారేనా? ఇలా చేస్తారా? అంటూ రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
 
ఇక కొందరు అయితే ఐరా ఖాన్ దారుణంగా బూతులు తిడుతున్నారు. ఇలా మొత్తానికి ఐరా ఖాన్ బికినీ ఫోటోలు, బర్త్ డే సెలెబ్రేషన్స్ మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి.