మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:36 IST)

కొత్త లవ్‌తో రామ్ చరణ్.. ఉపాసనకు షాక్..!

Ramcharan
మెగా చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్నప్పటికీ తాజాగా తన కొత్త లవ్‌తో వార్తల్లో నిలుస్తూ ఉపాసనకు గట్టి షాక్ ఇస్తున్నారని టాక్. ఇదేంటి అనుకుంటున్నారా.. చెర్రీ ప్రేమలో పడ్డారంటే మరొక అమ్మాయితో ప్రేమలో పడ్డారనుకుంటే పప్పులో కాలేసినట్టే. 
 
చరణ్ తన ప్రేమను వ్యక్తపరుస్తుంది ఓ కుక్కపిల్ల పైన. తాజాగా రామ్ చరణ్ తన కుక్కపిల్లను అభిమానులకు పరిచయం చేశాడు. చెర్రీ తన కుక్కపిల్లకు రైమ్ అనే పేరు పెట్టినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన రైమ్ తో కలిసి దిగిన ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూస్తుంటే రైమ్ చెర్రీ ఎక్కడికి వెళ్లిన వదిలిపెట్టేలా అనిపించడం లేదని తెలుస్తుంది. 
 
ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చిత్రీకరణ పూర్తి కాగా కొరటాల శివ ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.