మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (11:44 IST)

హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని ఫ్యాన్స్ పూజలు

ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ త్జే త్వరగా కోలుకోవాలని కోరుతూ మెగా అభిమానులతో పాటు సాధారణ జనం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 
 
తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్‌లోనూ ఇదే చెప్పారు. యాక్సిడెంట్ అయి కూడా 24 గంటలు గడవడంతో ఆయన ఆరోగ్యంలో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు వైద్యులు. స్పృహలోకి రావడమే కాదు.. చికిత్సకు కూడా స్పందిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.
 
ఈ నేపథ్యంలో సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన దగ్గర్నుంచి అమ్మ ప్రేమ ప్రేరణ ఆశ్రమంలో ఉండే వృద్ధులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన కోసం తిండి తిప్పలు మానేసి దేవుడి ముందు కూర్చున్నారు. తమకు దేవుడు ఇచ్చిన బిడ్డ సాయి తేజ్ అంటూ ఏడుస్తున్నారు. 
 
అతడికేం కాదని.. కాకూడదని.. మళ్లీ త్వరలోనే మామూలు మనిషి అయి అందరి ముందుకు వచ్చేస్తాడని వాళ్లు చెప్తున్నారు. ఆశ్రమ వాసులతో సాయి ధరమ్ తేజ్‌కు కూడా చాలా అనుబంధం ఉంది. తమ బిడ్డకు ఏం కాదని వాళ్లు దీవిస్తున్నారు. ఆ దేవుడు ఖచ్చితంగా సాయిని క్షేమంగా బయటికి తీసుకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.