శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (19:12 IST)

దర్శకుడు తేజ అహింస విడుదలకు సిద్ధం

Ahimsa new poster
Ahimsa new poster
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అహింస 'తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన 'అహింస'  ఫస్ట్, టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'నీతోనే నీతోనే', 'కమ్మగుంటదే'  పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.  తాజాగా త్వరలోనే సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ రెండో కొత్త పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్. అభిరామ్ యాక్షన్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  
 
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.