శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (11:03 IST)

"అహింస" నుంచి మాస్ మసాలా సాంగ్... తేజ నుంచి మరో లవ్ స్టోరీ

ahimsa
దర్శకుడు తేజ నుంచి మరో ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతోంది. దీనికి "అహింస" అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఓ మాస్ మసాలా సాంగ్‌ను దీపావళి పండుగను పురస్కరించుకుని సోమవారం విడుదల చేశారు. ఇందులో హీరోగా దగ్గుబాటి అభిరామ్ పరిచయమవుతున్నారు. అలాగే, సంగీత దర్శకుడుగా ఆర్పీ పట్నాయక్ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన పలు ప్రేమకథా చిత్రాలు సంచలన విజయాలను నమోదు  చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు చాలా విరామం తర్వాత ఆయన మళ్లీ మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గీతిక హీరోయిన్‌గా పరిచయమవుతుంది. 
 
అయితే, దీపావళి సందర్భంగా ఈ చిత్రంలోని ఓ మాస్ మసాలా సాంగ్‌కు సంబంధించిన లిరికల్ వీడియోను విడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇది పక్కా మాస్ మసాలా సాంగ్. కేవలం కుర్రకారును దృష్టిలో ఉంచుకుని ఈ సాంగ్‌ను రూపొందించారు. 
 
"అమ్మేశానే.. అమ్మేశానే.." అంటూ మంచి ఊపునిచ్చే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు గేయ రచన చంద్రబోస్ చేశారు మంగ్లీతో కలిసి ఆర్పీ పట్నాయక్, చంద్రబోస్‌లు కలిసి పాడారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.