సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (17:08 IST)

కంటెంట్ ఉన్న ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారుః నీతో ప్రి రిలీజ్‌లో రాజ్ కందుకూరి

neetho prerelease
neetho prerelease
అభిరామ్ వర్మ , సాత్వికా రాజ్  హీరో హీరోయిన్లుగా బాలు శర్మ  దర్శకత్వంలో రూపొందిన చిత్రం `నీతో`. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ జంజాల సంయుక్తంగా నిర్మించిన చిత్రం "నీతో". వివేక్ సాగర్ సంగీతం సమాకూర్చారు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్రం యూనిట్ గురువారంనాడు ప్రి రిలీజ్  ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి, నటుడు శివ, ఐ.ఏ.ఎస్ సురేష్ బాబులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు  పాల్గొన్నారు. 
 
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. బాలు శర్మ నేను చేసిన పెళ్లి చూపులు  సినిమాకు వర్క్ చేశాడు. తరుణ్ భాస్కర్ దగ్గర వర్క్ చేయడంతో ఆ ఫ్లేవర్ తనలో ఉంటుంది. ప్రస్తుత ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడరు  కంటెంట్ ఉన్న ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాలో కూడా మంచి పాయింట్ ఉన్నట్టు టీజర్ ట్రైలర్, చూస్తే తెలుస్తుంది.పాటలు చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్ లు చాలా బాగా నటించారు.ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్ వర్క్ చేశారు.  "నీతో" వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఇండస్ట్రీ కి కొత్తవారిని పరిచయం చేస్తున్న నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
 
హీరో శివ కందుకూరి  మాట్లాడుతూ... "నీతో"  మూవీ సింపుల్ గా చాలా బాగా తీశారు.. అభిరామ్ నాకు చాలా కాలంగా తెలిసు.తను మంచి యాక్టర్. బాలుశర్మ గారు ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన ఈ సినిమా పెద్ద విజయం  సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత స్నేహాల్ మాట్లాడుతూ...ఇదొక ఫ్రెస్ లవ్ స్టోరీ. ఆనంద్ లాంటి మంచి లవ్ స్టోరీ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అందరూ అదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
మరో నిర్మాత ఏవీఆర్ స్వామి మాట్లాడుతూ..డిఫరెంట్ కంటెంట్‌తో  వస్తున్న మేము తీసిన కథను  నమ్మి  సినిమాను రిలీజ్ చేయడానికి  ముందుకు వచ్చిన  పి.వి.ఆర్ ఉదయ్ గారికి ధన్యవాదములు తెలిపారు.  
 
చిత్ర దర్శకుడు బాలు శర్మ మాట్లాడుతూ, “మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు”లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా  ఈ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
 
చిత్ర హీరో అభిరామ్ వర్మ  మాట్లాడుతూ..ఇంతముందు  నేను చేసిన సినిమాల ద్వారా లవ్  స్టోరీ లకు పనికిరాడు అనడంతో  మంచి లవ్ స్టోరీ తియ్యాలనే కసి పెరిగింది. దాంతో  ఇప్పుడు వస్తున్న సినిమాలకు  భిన్నంగా ఉండే మంచి లవ్ సబ్జెక్టుతొ వ‌స్తున్నా అన్నారు.
 
చిత్ర హీరోయిన్ సాత్వికా రాజ్ మాట్లాడుతూ..చాలా లవ్ స్టోరీ లు ఉన్నాయ్, కానీ ఇప్పుడు ఒక ఫ్రెష్ అండ్ న్యూ  లవ్ స్టోరీ  రావాలంటే కష్టం, ఈ కథను విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అందుకే చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశామ‌ని అన్నారు. ఇంకా పి.వి.ఆర్ ఉదయ్, ఐ.ఏ.ఎస్ సురేష్ బాబు త‌దిత‌రులు మాట్లాడారు.