వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అంశంతో నీతో చిత్రంః సాత్వికా రాజ్
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో హీరోయిన్లుగా బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ నీతో. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా సాత్వికా రాజ్ సినిమా గురించి పలుఆసక్తికర విషయాలను పంచుకుంది.
- ఈ సినిమాలో నా పాత్ర పెద్దగా ప్రాబ్లెమ్స్ అంటూ ఏమి లేని ఒక బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిగా కనిపిస్తాను. ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి, కొన్ని అనుకోని పరిస్థితిలు వలన ఎటువంటి ప్రాబ్లెమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లెమ్స్ ను ఎలా ఫేస్ చేశాను అనేది ఈ సినిమాలో నా కేరక్టర్.
- ఇదొక లైట్ లవ్ స్టోరీ జాన్రా, కానీ రెగ్యులర్ లవ్ స్టోరీస్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనే థీమ్ తో ఈ సినిమా మొత్తం సాగుతుంది.
- వివేక్ సాగర్ గారితో నాకు అంతగా ఇంట్రాక్షన్ లేదు కానీ మా సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, కథకు ఏమి కావాలి అది తన మ్యూజిక్ ద్వారా వివేక్ సాగర్ అందించారు.
- అభిరామ్ వర్మ చాలామంచి కో-స్టార్. ఆయనతో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది, అభిరామ్ మంచి సపోర్టివ్ యాక్టర్, కొన్ని సీన్స్ తీసినప్పుడు కానీ, షాట్స్ లో రియాక్షన్స్ లో డైలాగ్స్ విషయం లో చాలా మంచి హెల్ప్ చేసాడు.
- ఈ కథను మీకు చెప్పినప్పుడు ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ లా కాకుండా చాలా డిఫెరెంట్ గా అనిపించింది. అది నాకు బాగా నచ్చింది. బాలు గారు నాకు ఈ కథ చాలా సేపు చెప్పారు. చాలా లవ్ స్టోరీ లు ఉన్నాయ్, కానీ ఇప్పుడు ఒక ఫ్రెష్ అండ్ న్యూ లవ్ స్టోరీ రావాలంటే కష్టం, సో ఈ కథను విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది ఆశిస్తున్నాను.