1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: సోమవారం, 3 అక్టోబరు 2022 (18:12 IST)

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నీతో

Abhiram Varma, Satvika Raj
Abhiram Varma, Satvika Raj
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ "నీతో". పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
 
తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందన  లభించింది.  "మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్  అయిందో  గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్  అవుతుందో గుర్తురాదు"లాంటి యూత్  కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి ఈ చిత్రంలో. "నీతో" చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 
 
తాజాగా ఈ చిత్రం నుండి "లలనా మధుర కలనా" అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వరుణ్ వంశి బి రచించిన ఈ పాటను హరిహరణ్ ఆలపించారు. 
"అలుపై, మలుపై, ఎదురై ఆదమరించింది గమననా 
గెలుపై మెరుపై మెరిసేనా గగనములై  .. అంటూ పాటలోని మంచి పొయిటిక్ ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తుంది. 
 
"నీతో" చిత్రానికి సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన 'నీతో' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.