1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rajigadu Rajayyadu', starring and directed by Altaf Hasan, is ready.

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

Rajigadu Rajayyadu ..Altaf Hasan
Rajigadu Rajayyadu ..Altaf Hasan
బట్టల రామస్వామి బయోపిక్కు హీరో అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ "రాజిగాడు రాజయ్యాడు" అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.
 
 
ఈ రోజు "రాజిగాడు రాజయ్యాడు" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే - ఒక గఢీ బయట ఒంటిపై గాయాలతో ఒక పంది పిల్లను చేతిలో పట్టుకుని కుర్చీలో హీరో కూర్చుని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అలాగే చుట్టుపక్కల కుల వృత్తులకు సంబంధించిన పని ముట్లు ఉండటం ఆలోచన రేకెత్తిస్తుంది . ఆ పెద్ద గఢీ లోని వారికి హీరోకు ఉన్న సంబంధం ఏంటి ?, పంది పిల్లను ఆయన ఎందుకు చేతిలో పట్టుకుని ఉన్నారు ?, ఆయన ఒంటిపై గాయాలకు, గొడవలకు కారణం ఏంటి ? వంటి అంశాలతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సినిమా టైటిల్ లోనే మంచి నేటివిటీ కనిపిస్తోంది. రాజిగాడు ఎవరు ఎలా రాజయ్యాడు అనేది సినిమాలో చూడాల్సిందే.
 
నటీనటులు - అల్తాఫ్ హసన్, అను శ్రీ, డా. గోరటి వెంకన్న, గీతా అగర్వాల్, రాజేంద్ర మోహన్ నను, శ్రీవర్ధన్ త్రివేది, సుజాత దీక్షిత్, గోవర్ధన్ రెడ్డి, సంజయ్ గౌడ్, డా. శివకుమార్ కాముని, తదితరులు
 
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం