పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోయారు.. ఫ్యాన్స్‌కు షాక్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు నటుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడిపోతున్నట్లు ప్రకటించారు. దీనితో వారి పదమూడేళ్ల వివాహ బంధం ముగిసింది.
తెలియని వారి కోసం, పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను 2013 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్' (ప్రత్యేక వివాహ చట్టం) కింద వివాహం చేసుకున్నారు. వీరికి పోలేనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తమ శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో... "మా జీవితంలో ఒక ముఖ్యమైన కాలాన్ని కలిసి గడిపిన తర్వాత, పరస్పర అవగాహనతో, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మేము మంచి స్నేహితులుగా కొనసాగుతాము. మా అద్భుతమైన పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటాము. పిల్లల సంతోషం, వారి సంక్షేమమే మా ఇద్దరికీ ఎప్పటికీ ప్రాధాన్యతగా ఉంటాయి.
"మా జీవితంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పు సమయంలో, మీ అవగాహనను, దయను కోరుకుంటున్నాము, అలాగే మా వ్యక్తిగత గోప్యతను గౌరవించవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.. విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే, అన్నా కొనిదెల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారు.
ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు, చిత్ర పరిశ్రమలోని వారి శ్రేయోభిలాషులకు పెద్ద షాక్‌గా మారింది, ఎందుకంటే వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని అందరికీ తెలుసు. నిజానికి, ఈ ఏడాది సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, అన్నా ఆయనకు ఒక హృదయపూర్వక సందేశాన్ని రాసుకొచ్చిన సంగతి తెలిసిందే.

