మాజీ సీఎం జయలలిత రాజకీయ వారసుడిగా హీరో ధనుష్?
తమిళనాడు అధికార పార్టీ టీవీకెని ధీటుగా ఎదుర్కోవాలంటే తగిన వ్యక్తి కావాలని అన్నాడీఎంకె ఆరాటపడుతోంది. ఈ క్రమంలో హీరో ధనుష్ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు సంకేతాలు పంపించినట్లు తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకె పార్టీలోకి ధనుష్‌ను తీసుకుని వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.
ధనుష్ అన్నాడీఎంకేలోకి తీసుకువచ్చేందుకు ఎడప్పాటి పళనిస్వామి శక్తికొద్దీ కృషి చేస్తున్నారనీ, ధనుష్ రాకతో పార్టీకి పునరజ్జీవం వస్తుందని ఆయన విశ్వసిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హీరో ధనుష్ అన్నాడీఎంకేలోకి కనుక ఎంట్రీ ఇస్తే ఆయనకు అన్నాడీఎంకే యూత్ వింగ్ బాధ్యతలు కట్టబెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.

