1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 36 Held For Prostitution During Raids On Lodges In Nellore

నెల్లూరు లాడ్జీలలో వ్యభిచారం.. 36మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

romance
నెల్లూరులోని పలు లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార కార్యకలాపాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై 36 మందిని అరెస్టు చేశారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దాడులు జరిగాయి. మానస, పీఎస్కే, పీవీకే, సాయి లాడ్జీలలో ఈ తనిఖీలు నిర్వహించారు. 
 
సుమారు 14 మంది మహిళలు, 17 మంది పురుషులు, 5 మంది లాడ్జీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. నిందితుల నుండి పోలీసులు 27 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
తర్వాతి కథనం
Golden fish: గోదావరిలో వలకు చిక్కిన గోల్డెన్ చేపలు.. లక్షాధికారులైన జాలర్లు