1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AE Nookaraju Grandson Riyansh Sensational Comments On Sadiq Khan

నాన్న తాగే ప్రోటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి చంపేశాడు.. అమ్మను హింసించాడు..

Riyansh
Riyansh
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆయన మనవడు రియాన్ష్ కీలక వివరాలు బయటపెట్టాడు. మూడో తరగతి నుంచే సాదిక్ ఖాన్ తన షూటింగ్ కోచ్‌గా పరిచయమయ్యాడని, తన తల్లిని దారుణంగా హింసించాడని 10 ఏళ్ల రియాన్ష్ తెలిపాడు. నాన్న తాగే ప్రోటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి చంపేశాడని, ఈ విషయం బయటకు చెబితే ఉగ్రవాదులకు అమ్మేస్తానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
అలాగే సౌజన్యపై ఇస్లాం మతంలోకి మారాలని సాదిక్ ఒత్తిడి తెచ్చాడని, బ్యాంక్ ఖాతాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నాడని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. రియాన్ష్ కార్తికేయను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లిన ఎంపీ, బాలుడికి భద్రతతో పాటు ఆస్తులన్నీ అతని పేరు మీదకు బదిలీ చేయాలని కోరారు. అలాగే ఆ బాలుడి చదువుకు సహకరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు ఉదయ్ అన్నారు. 
 
ఆస్తులు ఆ బాలుడికి దక్కేలా చూసేందుకు నూకరాజు రాసిన వీలునామాను మార్చాల్సి ఉందని చెప్పారు. కాగా  ఏఈ నూకరాజు కుటుంబం హత్య, ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్‌ను వారం రోజుల పాటు విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
WhatsApp: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్లు.. అన్నోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే?