1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp's new security features: Major changes you need to know

WhatsApp: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్లు.. అన్నోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే?

WhatsApp
WhatsApp
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా కాంటాక్ట్ లిస్ట్‌లో లేని (అన్నోన్) నంబర్ల నుంచి వచ్చే కాల్స్ వివరాలను ముందుగానే తెలుసుకునే అవకాశం లభించనుంది. ఏదైనా తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు.. అది విదేశీ నంబరా లేక మీరు సభ్యులుగా ఉన్న ఉమ్మడి వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చిందా అనే వివరాలు నేరుగా స్క్రీన్‌పైనే స్పష్టంగా కనిపించేలా కొత్త ఫీచర్ వచ్చేసింది. 
 
దీనివల్ల ఫ్రాడ్ కాల్స్, సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులు ముందే అప్రమత్తమయ్యే అవకాశం వుంటుంది. అలాగే టూ-స్టెప్ వెరిఫికేషన్ కూడా మారనుంది. 6-డిజిట్ పిన్ స్థానంలో, ఇకపై అక్షరాలు, సంఖ్యల కలయికతో కూడిన ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ, స్క్రీన్ లాక్ వంటి మరిన్ని పాస్‌కీలను యాడ్ చేసుకోవచ్చు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మద్యం మత్తులో ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై..?