సంబంధిత వార్తలు
- సినిమా ఛాన్స్ పేరుతో మహిళా టెక్కీపై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం!!
- అప్పు ఇచ్చిన మహిళ తల్లిని చంపి ముక్కలు చేసిన కిరాతకులు... ఎక్కడ?
- ఇంటికి వచ్చిన స్నేహితురాలు.. గంజాయి మత్తులో భర్త అత్యాచారం.. సహకరించిన భార్య!!
- పావురాన్ని కాపాడేందుకు కరెంట్ స్తంభం ఎక్కాడు.. తర్వాత?
- భార్యపై అనుమానం.. కత్తెరతో పొడిచి చంపేసిన భర్త! (Video)
రూ.2లక్షల కోసం సహజీవనం చేసే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
డబ్బు కోసం సహజీవనం చేసే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఓ దుండగుడు. అనంతపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 60 శాతం కాలిపోయిన ఆ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ మహిళ వాంగ్మూలాన్ని రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పార్వతి, మోహన్ అనే వ్యక్తితో సహజీనం చేస్తుండేది. మహిళకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె పేరిట బ్యాంక్‌లో రూ.2 లక్షల డిపాజిట్ ఉండింది. కుమార్తె పేరు మీద బ్యాంక్‌లో రూ.2 లక్షలు ఉందని మోహన్ తెలిసింది. అయితే తనకు ఆ రెండు లక్షల రూపాయాలు కావాలని కుమార్తెను తీసుకెళ్లిపోయాడు.
రెండు లక్షల రూపాయాలు ఇస్తేనే, కుమార్తెను ఇస్తానని పార్వతికి చెప్పాడు మోహన్. అయితే అందుకు పార్వతి తాను రెండు లక్షల రూపాయాలు ఇస్తానని, ఆ తరువాత తమ జోళికి రావద్దని అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు లక్షలిచ్చి అతనితో దూరంగా వుండిపోయింది.
ఈ సమయంలో మోహన్, ఆయన సోదరుడు సిద్ధులు కలిసి పార్వతిపై దాడి చేశారు. తమతో తెచ్చుకున్న పెట్రోల్‌ని పార్వతిపై పోసి నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు గుర్తించి కాలిపోతున్న ఆమె దగ్గరకు హుటాహుటినా అక్కడకు చేరుకుని మంటలు ఆపారు. వెంటనే చికిత్స నిమిత్తం పార్వతిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
