సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

భార్యపై అనుమానం.. కత్తెరతో పొడిచి చంపేసిన భర్త! (Video)

woman murder
ఈస్ట్ గోదావరి జిల్లాలోని నిడదవోలులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. కత్తెరతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో జరిగింది. మృతురాలిని నవ్యగా గుర్తించారు. 
 
నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు పదకొండేళ్ల క్రితం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా చిరంజీవి భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది అన్న అనుమానం పెంచుకున్నాడు. 
 
ఇదే విషయంపై గత రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన చిరంజీవి... భార్య నవ్యను కత్తెరతతో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడటంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై మృతురాలి తండ్రి తండ్రి వెలగం శ్రీను నిడదవోలు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.