గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (11:27 IST)

గురు పౌర్ణమి.. అమ్మవారిని పూజించడం కూడా విశేషమే..

ammavaru
ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి రావడం వల్ల కూడా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. దీని ప్రకారం, ఈ సంవత్సరం జూలై 21 ఆదివారం వస్తుంది. ఈ రోజున అమ్మవారి పూజ విశిష్టమైనది. ఆషాఢమాసం తొలి పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించిన రోజు. అదే వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. 
 
అందుకే ఆ రోజు విష్ణుమూర్తినో, దత్తాత్రేయుడినో పూజించవచ్చు. వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యారు. వాటితో పాటు భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించారు.

గురుశిష్యుల ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా కూడా వ్యాసపౌర్ణమికి చాలా ఘటనలు చెబుతారు. గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని విశ్వాసం.