బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (11:07 IST)

గురు పౌర్ణమి.. గురువులను ధ్యానించండి.. పసుపు వస్త్రాలు దానం చేస్తే?

Guru Bhagavan
నేడు గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు చేసుకునే పండుగ. ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది.
 
గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ గురుపౌర్ణమిని వ్యాస పూర్ణిమి అని కూడా అంటారు. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 
 
అందుకే ఆ రోజున భగవంతునితో సమానమైన గురువులను నమస్కారించి పూజించుకోవాలి. ఈ రోజున గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని నమ్మకం. 
 
అంతేకాకుండా.. గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయాలి. ఈ రోజున దేవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.