ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జులై 2024 (17:28 IST)

శ్రీలంక అభిమానిని కలిసిన స్మృతి మందాన.. గిఫ్ట్‌గా ఏమిచ్చిందో తెలుసా? (video)

Smriti Mandhana
Smriti Mandhana
మహిళల ఆసియా కప్ 2024లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ సూపర్ స్టార్ స్మృతి మందాన మెరిసింది. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం ప్లేయర్ మైదానంలో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచిపోతుంది. 
 
తాజాగా క్రికెట్ ద్వారా ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకునే స్మృతి మందాన.. శ్రీలంక ఫ్యాన్‌ను మైదానంలో కలిసి వార్తల్లో నిలిచింది. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌ తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంకకు చెందిన ఓ చిన్నారి అభిమానిని ఆమె కలిసింది. 
 
అదీషా హెరాత్‌ అనే చిన్నారికి స్మృతి మందాన అంటే చాలా ఇష్టం. ఆమెను కలవాలని ఎన్నో సార్లు తన తల్లితో చెప్పేది. ఆ చిన్నారి అదీషా హెరాత్‌‌ కోరిక మేరకు స్మృతి మందాన స్టేడియంలోనే సర్ ప్రైజ్ చేసింది. అదీషా హెరాత్‌‌‌తో కాసేపు గడిపింది. ఆపై ఓ ఫోన్ కూడా గిఫ్ట్ చేసింది. తన బిడ్డను మందాన కలవడం అదృష్టం అని.. ఆమె నుంచి ఫోన్ గిఫ్ట్‌గా పొందడం హ్యాపీగా వుందని చెప్పుకొచ్చారు అదీషా హెరాత్‌ తల్లి. ఈ మూమెంట్ నెట్టింట వీడియో రూపంలో వైరల్ అవుతోంది.