శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జులై 2024 (13:58 IST)

పావురాన్ని కాపాడేందుకు కరెంట్ స్తంభం ఎక్కాడు.. తర్వాత?

పావురాన్ని రక్షించేందుకు ఆ బాలుడు సాహసం చేశాడు. ఆ సాహసం కాస్త అతని ప్రాణాలను బలిగొంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్‌లో ఇరుక్కుపోయిన ఓ బాలుడు మృతి చెందాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కరెంటు స్తంభం ఎక్కిన ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.ఈ సంఘటన బుధవారం హనుమాపురా గ్రామంలో జరిగింది.

మృతుడు 12 ఏళ్ల రామచంద్ర, ఆరో తరగతి విద్యార్థిగా గుర్తించారు. విద్యుత్ స్తంభంపై ఉన్న హైటెన్షన్ వైర్‌లలో ఒకదానిపై ఇరుక్కుపోయిన పావురం కష్టపడడాన్ని బాలుడు చూశాడు. ధైర్యంగా ఆ చిన్నారి పావురాన్ని రక్షించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించగా.. రాంపుర పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.