శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (09:19 IST)

సినిమా ఛాన్స్ పేరుతో మహిళా టెక్కీపై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం!!

rape
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో మహిళా టెక్కీ అత్యాచారానికి గురైంది. సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని నమ్మించిన ఓ  షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు పుష్పాలగూడలోని ఓ కంపెనీలో టెక్కీగా పని చేస్తుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ వర్మ మరో యువతి ద్వారా బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 
 
ఈ క్రమంలో బుధవారం ఆమెను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు. అతని మాటలు నమ్మి ఇంటికి వెళ్లి మహిళా టెక్కీకి శీతలపానీయంలో మత్తుమందు కలిపి తాగించాడు. ఆ తర్వాత ఆమె అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు తేరుకుని తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సిద్ధార్థ్ వర్మని అరెస్టు చేశారు.