1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Five Killed In Explosion At A House In Andhra Pradesh

సత్యసాయి జిల్లా: ఇంట్లో పేలుడు ఐదుగురు మృతి, 20మంది గాయాలు

fire
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం ఒక ఇంట్లో సంభవించిన పేలుడులో ఐదుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కదిరి మండలం, కుమ్మరవండ్ల పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
 
ఒక కార్మికుడి ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో, ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ భారీ పేలుడు ధాటికి పక్కనే ఉన్న మరికొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
 
ఈ పేలుడులో కనీసం ఐదుగురు మరణించగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో నాలుగు డిటోనేటర్లు నిల్వ ఉంచినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన పట్ల రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
స్నేహితులు దాడి.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య