1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Former Minister Seediri Appalarajus Arrest

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

minister appalaraju
వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని నివాసంలో పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 10న అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మ బైక్‌తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు భారీ కుట్రకు పాల్పడ్డారు. తన కుమారుడు స్థానంలో అతని స్నేహితుడు సిద్ధార్థ త్యాడిని బలిచేసి, అతడిని జైలుకు పంపాలని చూశారు. పైగా, పెద్దల సమక్షంలో మృతుడి కుటుంబానికి తూతూ మంత్రంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి మృతుని కుటుంబ సభ్యులు నోరు మెదపకుండా చేశారు. 
 
అలాగే, ప్రమాదానికి కారణమైన బైకును తప్పించి నేరం కప్పిపుచ్చేందుకు చూశారని అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు ఈ వైకాపా నేత గత రెండు మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
స్లావియా మోంటే కార్లో కలర్ ప్యాలెట్‌ను విస్తరించిన స్కోడా ఆటో ఇండియా