సంబంధిత వార్తలు
- పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్
- వరకట్నం అదనంగా తెమ్మన్నాడు.. కాదంటే స్నేహితులతో సరసాలాడమన్నాడు..
- మేనకోడలితో కీచక మామ లింకు... పెళ్లి తర్వాత కుదరదన్నందుకు బ్లాక్మెయిల్
- బుద్ధిగా చదువుకోమన్న తల్లి.. కిరాతకంగా చంపేసిన కొడుకు.. ఎక్కడ?
- కరోనా కాలంలో రెచ్చిపోయిన కామాంధులు.. యువతిపై గ్యాంగ్ రేప్
అప్పు తిరిగి చెల్లించలేదని.. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..
గుంటూరు జిల్లాలో ఈ మధ్య నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మరోవైపు హత్యలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. అప్పు చెల్లించలేదన్న కోపంతో.. ఓ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఓ దుర్మార్గుడు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు, నకరికల్లు మండలం శివాపురానికి చెందిన రమావంత్ మంత్రూభాయి (55) అనే మహిళ... శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర తన అవసరం నిమిత్తం రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పుకు తన పొలాన్ని తాకట్టుగా పెట్టింది. కానీ అప్పు తీర్చాలంటూ శ్రీనివాస్ రెడ్డి ఆమెను వేధించడం మొదలెట్టాడు.
ఎక్కడ కనబడితే అక్కడ డబ్బులడిగే శ్రీనివాస్ సోమవారం పొలం వద్దకే వెళ్లాడు. అంతటితో ఆగకుండా అప్పు తీర్చనందుకు సదరు మహిళను ట్రాక్టర్‌తో తొక్కించాడు శ్రీనివాసరెడ్డి.. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
