సంబంధిత వార్తలు
- రౌడీలు పోలీసుల్ని చంపేస్తున్నారు, ఆబోతులు బట్టలిప్పి తిరుగుతున్నారు: చంద్రబాబు ఆగ్రహం
- ఇది మీ ఇల్లు అనుకోండి బాబు... అపుడపుడూ ఢిల్లీకి రండి..
- ప్రధాని మోదీతో ఏకాంతంగా చంద్రబాబు 5 నిమిషాల చర్చ, ఏంటి సంగతి?
- దిల్లీలో చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎంపీ కేశినేని నాని అసహనం
- Vice-Presidential Poll: ఓటు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వీలు చూసుకుని ఢిల్లీకి రమ్మన్నారు : మోడీ కరచాలనంపై బాబు వివరణ
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య కరచాలన భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏం జరిగిందో పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ భేటీ ద్వారా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చింది.
దీని గురించి పార్టీ నేతలకు చంద్రబాబు అన్ని వివరాలను వివరించారు. "రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను ఒక పక్కన ఉండి వేరే వారితో మాట్లాడుతున్నాను. ప్రధాని ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే నా వద్దకు వచ్చారు. మనం కలిసి చాలా రోజులైంది... ఢిల్లీ రావడం లేదా అని అడిగారు. ఢిల్లీలో నాకు పనేమీ లేదని, రావడం లేదని చెప్పాను.
మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి.. మనం ఒకసారి కలవాలని ఆయన అన్నారు. నేను కూడా మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నానని చెప్పాను. ఒకసారి వీలు చూసుకుని ఢిల్లీ రండి. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే నాకు అనువుగా ఉన్న సమయం చెబుతాను.. వద్దురు గాని అని ఆయన అన్నారు. నేను కూడా సరేనన్నాను" ఇదీ ఢిల్లీలో జరిగిందని పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు.
