నయీమ్ కేసులో 93 మంది అరెస్ట్.. 126 ఫిర్యాదులున్నాయ్..
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో తీగ లాగితే డొంకలు కదులుతున్నాయి. ఈ కేసులో అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. నయీమ్ కేసులో అధికార తెరాస నేతలతో పాటు.. ఇతర రాజకీయ నేతలు, అధికారులకు కష్టాలు తప్పేలా లేవ
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో తీగ లాగితే డొంకలు కదులుతున్నాయి. ఈ కేసులో అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. నయీమ్ కేసులో అధికార తెరాస నేతలతో పాటు.. ఇతర రాజకీయ నేతలు, అధికారులకు కష్టాలు తప్పేలా లేవు. నయీమ్ భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. నయీమ్ ఇంట్లో సేకరించిన ఫోటో ఆల్బమ్‌లతో పాటు, నయీమ్ ఫోన్‌కాల్ డేటా ఆధారంగా నేతల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
సిట్ అధికారులు నయీమ్ అనుచరులను, కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను వరుసగా అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా సోమవారం మహబూబ్ నగర్‌కు చెందిన బత్తుల ఈశ్వరయ్యను సిట్ అధికారులు అరెస్టు చేశారు. రెండు, మూడు రోజుల్లో మరిన్ని అరెస్టులు చేస్తామని ఈ సందర్భంగా అధికారులు మీడియాకు తెలిపారు. నయీమ్ కేసులో ఇప్పటి వరకు 126 ఫిర్యాదులు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 93 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.