1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tirupati: Lorry Catches Fire After Hitting Hillock, Driver Escapes

తిరుపతి: కొండను ఢీకొన్న లారీ.. అగ్నికి ఆహుతి.. డ్రైవర్‌కు ఏమైందంటే?

Lorry
Lorry
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని బకరపేట ఘాట్ రోడ్డుపై, ఆదివారం నాడు ఒక లారీ కొండను ఢీకొట్టి అగ్నికి ఆహుతైంది. అయితే, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే, పైపులతో నిండిన ఈ లారీ మహారాష్ట్రలోని బెర్హంపూర్ నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చంద్రగిరి సమీపంలోని బకరపేట ఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లారీ కొండను ఢీకొట్టింది. 
 
ఢీకొట్టిన వెంటనే లారీ ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ సకాలంలో వాహనం నుండి బయటపడి, ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత వ్యాపించిన మంటల్లో లారీ పూర్తిగా కాలిపోయింది. 
 
మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. చంద్రగిరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
హైదరాబాద్ రోడ్లపై గుంతలు.. రోడ్డుపై కూర్చున్న వ్యక్తి.. బాగు చేసే వరకు కదలను