1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vijayawada Auto Driver Rapes Young Woman

విజయవాడలో ఘోరం.. యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎవరూ లేని ప్రదేశానికి?

rape
rape
కామాంధుల దుశ్చర్యలకు కఠినమైన చట్టాలు కళ్లెం వేయలేకపోతున్నాయి. విజయవాడలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటరిగా వచ్చిన ఆ యువతిని వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై అక్కడే వదిలేసి ఆటోతో పాటు పారిపోయాడు. 
 
తనపై జరిగిన దుర్ఘటనపై తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ వదిలిపెట్టిన స్థలం నుంచి ఏడ్చుకుంటూ వచ్చిన యువతిని చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
పరారిలో వున్న ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
తర్వాతి కథనం
హరీశ్ రావు తమ్ముడే ఇసుక మాఫియా కింగ్ : సీఎం రేవంత్ రెడ్డి