శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించినట్లైతే మీ సంకల్పం నెరవేరుతుంది. మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యల్లో ప్రవేశం లభిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కరింపబడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృషభం: శాస్త్ర, సాంకేతిక, మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు,...