భక్తులు ఆగండాగండి, కాణిపాకం దర్సన వేళలు మార్చారు, ఎప్పుడంటే?

kanipakam temple
జె| Last Modified మంగళవారం, 8 జూన్ 2021 (20:19 IST)
చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంలో దర్శన వేళలను దేవస్థానం మార్పు చేసింది. కరోనా కారణంగా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతుండటంతో దర్సన సమయాన్ని పెంచుతూనే నిర్ణయం తీసుకున్నారు.

కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం ఈఓ వేంకటేశులు మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్సనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉంది.

అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అదనంగా మరో గంట సమయాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆన్ లైన్లో దర్సన టిక్కెట్లు కూడా దొరుకుతున్నాయని, భక్తులు టిక్కెట్లను పొందవచ్చునంటున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా స్వామివారికి విరాళాలను కూడా అందివచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :