ఏపీలో కర్ఫ్యూ... శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ఉంటుందా?

tirumala temple
ఠాగూర్| Last Updated: బుధవారం, 5 మే 2021 (09:32 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా, ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలను అమల్లోకి తెస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో పాక్షిక లాక్డౌన్‌ను విధిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో బుధవారం నుంచి రెండు వారాలా పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానున్న‌విష‌యం తెలిసిందే. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మరుసటి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది.

ఇదిలావుంటే, ప‌లు దేవాల‌యాల్లో ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల్లో అయోమ‌యం నెల‌కొంది. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో శ్రీవారి ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి ఉందా లేదా అన్న దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. దీంతో ఈ విష‌యంపై భ‌క్తుల‌కు స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి పాలకమండలి.

శ్రీవారి దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12గంటల తర్వాత శ్రీవారి దర్శనం టోకెన్లతో వచ్చే భక్తులను అనుమతిస్తామని తెలిపింది. కర్ఫ్యూ సందర్భంగా స్వామివారి దర్శనం విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అయితే తిరుమల కొండపై కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.దీనిపై మరింత చదవండి :