ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (17:38 IST)

కరోనాతో 15 మంది తితిదే సిబ్బంది మృతి : వైవీ సుబ్బారెడ్డి

కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. శ్రీవారి సేవకు అంకితమైన సిబ్బంది సైతం ఈ వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 15 మంది ఉద్యోగులు మృతి చెందారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
తిరుమలలో విధులు నిర్వహిస్తున్నందువల్ల వీరు కరోనా బారిన పడలేదని... ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుంటారని, అక్కడే వీరు కరోనా బారిన పడ్డారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తామని చెప్పారు. ఇకపోతే, ఈ వైరస్ బారిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్నారు.
 
తితిదే ఉద్యోగుల కోసం బర్డ్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యంతో రేపటి నుంచి శ్రీవారికీ నైవేద్యం పెడుతామని తెలిపారు. భవిష్యతులో అన్నప్రసాదంలో కూడా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలతో భక్తులకు అన్నప్రసాదం పెట్టేందుకు ప్రయత్నిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.