1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (08:15 IST)

తెలంగాణాలో కరోనా పంజా : 600 మంది ఎస్బీఐ ఉద్యోగులకు పాజిటివ్

తెలంగాణా రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసిరింది. దీంతో ప్రతి రోజూ కుప్పలుతెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రెండో దశ కరోనా వ్యాప్తిలో తెలంగాణ రాష్ట్రంలో 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. 
 
కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్‌ బారిన పడుతున్నారని తెలిపారు. గురువారం నుంచి ఏప్రిల్‌ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని ఆయన చెప్పారు. 
 
హైదరాబాద్‌లోని‌ కోఠి , సికింద్రాబాద్‌ ఎస్బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపీ మిశ్రా తెలిపారు. కాగా, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే.